ప్రయోగాలు కాన్సిల్… ఫైనల్ కాన్సెప్ట్ ఇదే!!

0

త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. కొంతకాలం క్రితమే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. త్వరలో ఈ సినిమాను సెట్స్ మీదకి తీసుకువెళ్ల డానికి సన్నాహాలు చేస్తున్నారు. మరోపక్క, ఈ సినిమాలో కొత్త గా కనిపించడానికి ఎన్టీఆర్ గట్టి కసరత్తునే చేస్తున్నాడట. ఈ సినిమా కథానేపథ్యం ఏమిటనే ఆసక్తి ఎన్టీఆర్ అభిమానుల్లో నెలకొంది.


ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు… ఎప్పుడెప్పుడు అప్ డేట్ వస్తుందా సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలు అవుతుందా అని వారు ఓ రేంజ్ లో ఎదురు చూపులు చూస్తుండగా అజ్ఞాతవాసి ఫలితం ఈ సినిమాపై గట్టిగా పడటంతో ముందు ప్రయోగం చేయాలి అనుకున్నా ఇప్పుడు మనసు మార్చుకుని…


దాదాపు యాక్షన్ ఎంటర్టైనర్ గానే ఉండవచ్చని అంతా భావించారు. కానీ .. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వుండనుందనేది తాజా సమాచారం. కుటుంబం… బంధాలు… అనుబంధాలకు ప్రాధాన్యతనిస్తూ ఈ కథ కొనసాగుతుందని అంటున్నారు. త్వరలోనే టైటిల్ ను ప్రకటించడమే కాకుండా, కథానాయిక ఎవరనే విషయంలోనూ స్పష్టతను ఇవ్వనున్నారు.

Comments

Share.

Comments are closed.