ఎన్టీఆర్ సినిమాలో సీనియర్ హీరోయిన్…!

0

స్టార్ హీరోల సినిమాలు అనగానే… హీరోయిన్‌గా ఎవరు నటించబోతున్నారనే ఆసక్తి ఉండటం కామన్. కానీ ఎన్టీఆర్ కొత్త సినిమా విషయంలో ఓ కీలకమైన పాత్ర కోసం ఎవరిని తీసుకోబోతున్నారనేది ఆసక్తిగా మారింది.


ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రం ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ప్రారంభం కాగా మార్చి చివరి వారం నుంచి సెట్స్‌పైకి వెళ్లబోతోంది. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయం అటుంచితే త్రివిక్రమ్ సినిమాల్లో రెగ్యులర్‌గా కీలకపాత్రలో సీనియర్ హీరోయిన్స్ నటించడం కామన్‌గా మారింది. ఈ సినిమాలోనూ ఇలాంటి ఓ కీ రోల్ ఉందట. ఇప్పుడీ క్యారెక్టర్‌లో ఎవరు కనిపించబోతున్నారనేదే ఆసక్తికరంగా మారింది. ఖుష్బూ మొదలు రమ్యకృష్ణ వరకూ చాలామంది పేర్లు వినిపిస్తున్నాయట.


ఎన్టీఆర్ హిట్ మూవీ ‘యమదొంగ’లో ఖుష్బూ నటించిన సంగతి తెలిసిందే. అయితే ‘అజ్ఞాతవాసి’ టీమ్‌ను రిపీట్ చేయడం ఇష్టంలేకే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌ను మార్చేసిన దృష్ట్యా.. ఖుష్బూను కూడా రిపీట్ చేయలేకపోతున్నారట. ఇక నదియాను తీసుకుందామంటే ఆల్రెడీ త్రివిక్రమ్ సినిమాల్లో రెండుసార్లు నటించిన దృష్ట్యా కొత్తదనం మిస్ అవుతుంది. ఈ క్రమంలో ‘బాహుబలి’ సినిమాతో మరోసారి మెప్పించిన రమ్యకృష్ణను తీసుకోవాలనేది త్రివిక్రమ్ అభిప్రాయంగా తెలుస్తోంది. ‘సింహాద్రి’లో రమ్యకృష్ణ ఐటం సాంగ్ చేస్తే హిట్ అయింది కానీ ‘నా అల్లుడు’ సినిమాలో తారక్‌కు అత్తగా కీ రోల్ పోషిస్తే మాత్రం సినిమా డిజాస్టర్ అయింది. అందుకేనేమో తారక్ అంతగా ఆసక్తి చూపడం లేదు. దీంతో మీనా, సిమ్రాన్, లయతో సహా పలువురు ఇతర సీనియర్స్‌ను కూడా పరిశీలిస్తున్నారట. మరి వీరిలో ఎన్టీఆర్ సినిమాలో నటించబోయే ఆ నిన్నటితరం కథానాయిక ఎవరు కానున్నారో..!


Comments

Share.

Comments are closed.