ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, రాజమౌళి… ఆర్‌.ఆర్‌.ఆర్‌… ఆరంభం

0

ఎస్‌.ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కథానాయకులుగా ఓ చిత్రం తెరకెక్కబోతోందని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమాకి సంబంధించి రాజమౌళి నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. మరోవైపు ప్రీ పొడక్షన్‌ పనులు మాత్రం జరిగిపోతున్నాయి. ఇప్పుడు చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చేసింది.


దాన్ని ఓ టీజర్‌ రూపంలో విడుదల చేసింది చిత్రబృందం. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ అంటూ ఆంగ్లంలో మూడు ‘ఆర్‌’లను టీజర్‌లో చూపిస్తూ (అంటే రాజమౌళి, రామ్‌చరణ్‌, రామారావు అన్నమాట) అధికారిక ప్రకటన విడుదల చేసింది. దానిపై రాజమౌళి ముద్ర కూడా పడిపోయింది. ఈ చిత్రాన్ని డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. రాజమౌళి నుంచి ప్రకటన వచ్చేసింది కదా? ఇక సినిమాకి క్లాప్‌ కొట్టడమే ఆలస్యం. మరి దానికి ముహూర్తం ఎప్పుడు నిర్ణయించారో..?Comments

Share.

Comments are closed.