ఐపీఎల్‌ ప్రచారకర్తగా ఎన్టీఆర్‌

0

‘బిగ్‌బాస్‌’ షోతో తొలిసారి బుల్లితెరపై సందడి చేసిన కథానాయకుడు ఎన్టీఆర్. ఆయన మరోసారి బుల్లితెరపై ఆకట్టుకోవడానికి సిద్ధమౌతున్నారట. ఓ ప్రముఖ ఛానల్‌ ప్రసారం చేయనున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్ 2018) తెలుగు ప్రసారాలకు ఎన్టీఆర్‌ ప్రచారకర్తగా వ్యవహరించనున్నట్లు సమాచారం.


ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘బిగ్‌బాస్‌’ తెలుగు సీజన్‌ 1కు విశేషమైన ఆదరణ లభించింది. అత్యధిక టీఆర్పీ రేటింగ్‌ పొందిన తెలుగు షోగా కూడా అప్పట్లో గుర్తింపు పొందింది. రెండో సీజన్‌ త్వరలో ప్రారంభం కాబోతోంది.


ఎన్టీఆర్‌ ‘జై లవకుశ’ తర్వాత త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో నటించనున్నారు. దీని తర్వాత ఆయన ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. మల్టీస్టారర్‌గా రూపొందించనున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ మరో కథానాయకుడు. ఇలా వరుసగా సినిమాలు ఉండటం వల్ల ఎన్టీఆర్‌ ‘బిగ్‌బాస్‌’ సీజన్‌ 2కు వ్యాఖ్యాతగా చేయడానికి కుదరలేదట.

Comments

Share.

Comments are closed.