తారక్‌ – త్రివిక్రమ్‌ పక్కా ప్లానింగ్‌

0

‘యంగ్‌ టైగర్‌’ ఎన్టీఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో సరికొత్త లుక్‌తో కనిపించేందుకు ఓ వైపు తారక్‌ జిమ్ లో తీవ్ర కసరత్తుల చేస్తుండగా.. సినిమాను అనుకున్న విధంగా తెరకెక్కించేందుకు త్రివిక్రమ్‌ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సాధ్యమైనంత వేగంగా చిత్రీకరణ పూర్తి చేయాలని వీరిద్దరూ భావిస్తున్నట్లు సమాచారం.


ఒకటి లేదా రెండు షెడ్యూళ్లలోనే చిత్రీకరణ పూర్తి చేయాలని పక్కా ప్లానింగ్‌ రూపొందిస్తున్నట్లు వూహాగానాలు విన్పిస్తున్నాయి. ఎలాగైనా దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని పట్టుదలగా ఉన్నారని సమాచారం. ఈ చిత్రానికి ఎస్‌ఎస్ థమన్ సంగీతం అందించనున్నారు. తొలుత తమిళ సంగత దర్శకుడు అనిరుధ్‌ రవిచంద్రన్‌ను తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయిక. హారికా హాసిని క్రియేషన్స్‌ పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.


దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందే మల్టీస్టారర్‌ చిత్రంలోనూ తారక్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను సైతం ఇటీవల విడుదల చేశారు. జూన్‌ నుంచి ఈ చిత్రం కోసం నిర్వహించే వర్క్‌షాప్‌లో తారక్‌ పాల్గొంటారని అంటున్నారు. దీని కారణంగానే ‘బిగ్‌బాస్‌’ సీజన్‌ 2ను ఎన్టీఆర్‌ చేసే అవకాశం లేదని గత కొంతకాలంగా వార్తలు విన్పిస్తున్నాయి.

Comments

Share.

Comments are closed.