ఐపీఎల్‌ ప్రోమో షూట్‌లో తారక్‌!

0

క్రికెట్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2018 ‌(ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌) ఏప్రిల్‌ 7 నుంచి ప్రారంభం కాబోతోంది. ఓ ప్రముఖ ఛానెల్‌ ప్రసారం చేయనున్న ఐపీఎల్‌ తెలుగు ప్రసారాలకు ఎన్టీఆర్‌ ప్రచారకర్తగా వ్యవహరించనున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.


దీనిపై తారక్‌ ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. అయితే ఐపీఎల్‌ కోసం ఆయన‌ ప్రోమో షూట్‌లో పాల్గొన్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. తారక్ పక్కన ప్రముఖ హాస్యనటుడు మధు‌ (గుండెజారి గల్లంతయ్యిందే ఫేం) కూడా ఉన్నారు. ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘బిగ్‌బాస్‌’ తెలుగు సీజన్‌ 1కు విశేషమైన ఆదరణ లభించింది. అత్యధిక టీఆర్పీ రేటింగ్‌ పొందిన తెలుగు షోగా కూడా అప్పట్లో గుర్తింపు పొందింది.


తారక్‌ ప్రస్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో నటించనున్నారు. దీని తర్వాత ఆయన ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. మల్టీస్టారర్‌గా రూపొందించనున్న ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ మరో కథానాయకుడు. ఇలా వరుసగా సినిమాలు ఉండటంతో ఎన్టీఆర్‌ ‘బిగ్‌బాస్‌’ సీజన్‌ 2కు వ్యాఖ్యాతగా చేసేందుకు వీలుపడటంలేదని సమాచారం.

Comments

Share.

Comments are closed.