రాజమౌళి మల్టీస్టారర్‌… విలన్‌గా రాజశేఖర్‌?

0

ఎస్‌.ఎస్‌ రాజమౌళి ఓ మల్టీస్టారర్‌ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కథానాయకులుగా నటించబోతున్నారు. ఇటీవల ‘భారీ మల్టీస్టారర్‌ షురూ అయింది’ అంటూ రాజమౌళి… రామారావు… రామ్‌చరణ్‌ ఆంగ్ల పేర్లలో మొదటి అక్షరం ‘R’ వచ్చేలా #RRR పేరుతో 23 సెకన్ల నిడివికల వీడియోను పంచుకున్నారు. ఇప్పుడు ఈ మూడు ‘R’లలో మరో ‘R’ చేరబోతోంది.


ప్రముఖ నటుడు రాజశేఖర్‌ ఇందులో ప్రతినాయకుడి పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి సినిమాల్లో హీరో పాత్రలకు దీటుగా విలన్‌ పాత్రలూ ఉంటాయి. ఈ సినిమాలో విలన్‌గా రాజశేఖర్‌ అయితేనే బాగుంటుంది అని జక్కన్న భావించారట. ఇటీవల ‘పీఎస్‌వీ గరుడవేగ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు రాజశేఖర్‌. చాలా కాలం తర్వాత రాజశేఖర్‌ నుంచి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద చక్కటి వసూళ్లు సాధించింది.


డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ఈ మల్టీస్టారర్‌ సినిమా తెరకెక్కనుంది. ఇందులో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ సోదరుల్లా నటిస్తారని సమాచారం. బాక్సింగ్‌ నేపథ్యంలో సినిమా ఉంటుందని చెబుతున్నారు. తారక్‌, చరణ్‌ పాత్రలకు సంబంధించి ఇటీవల అమెరికాలో ఫొటో షూట్‌ చేశారట. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Source: Eenadu.net

Comments

Share.

Comments are closed.