ఏప్రిల్ 12 నుంచి ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా

0

ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కే చిత్రం ఏప్రిల్ 12నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్నదట. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ కొత్త లుక్ కోసం కేర్ తీసుకుంటున్నాడు. త్రివిక్రమ్ మార్క్ శైలిలో తెరకెక్కే ఈ చిత్రం పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వుంటుందని, దానికోసం ఎన్‌టిఆర్ కూడా కొత్త గెటప్‌లో కన్పిస్తాడని వార్తలు వస్తున్నాయి.


ఇప్పటికే ఆయన జిమ్‌లో జోరుగా కసరత్తులు చేస్తున్నాడు. ఈ సినిమాలో సునీల్ కూడా నటిస్తున్నాడని, అతని పాత్ర కమెడియన్‌గానే వుంటుందని తెలిసింది. ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా ఎంపికైంది. హారికా హాసిని బ్యానర్‌పై చినబాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.


Comments

Share.

Comments are closed.