చరణ్‌ కంటే బాగా ఎవరూ చేయలేరు : తారక్‌

0

సుకుమార్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ‘రంగస్థలం’ చిత్రలో ‘చిట్టిబాబు’ పాత్రలో చరణ్‌ ఒదిగిపోయాడంటూ అటు ప్రేక్షకులే కాదు ఇటు సినీ పరిశ్రమకు చెందిన వారు ఆయన నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో ‘యంగ్‌టైగర్’‌ ఎన్టీఆర్‌ కూడా చేరిపోయారు. ఇవాళ సినిమా వీక్షించిన అనంతరం ట్విటర్‌లో చిత్ర బృందాన్ని అభినందించారు.


‘ఇప్పుడే ‘రంగస్థలం’ చూశాను. హ్యాట్సాఫ్‌ చరణ్‌. ప్రస్తుతం నువ్వు అందుకుంటున్న ప్రశంసలకు అర్హుడివి. నా నుంచి కూడా ఒకటి అందుకో. మరెవరూ ఇంతకంటే బాగా చేయలేరు. అద్భుతమైన దర్శకత్వ ప్రతిభ చూపిన సుకుమార్‌కు అభినందనలు. అప్పటికాలానికి తగినట్లు ఓ భావోద్వేగ చిత్రాన్ని తెరకెక్కించాలన్న ధైర్యానికి అభినందనలు. సమంత, దేవిశ్రీప్రసాద్‌, మైత్రి మూవీస్‌, ‘రంగస్థలం’ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు. మీ సమర్థత కారణంగానే చిత్రం ఈ స్థాయిలో ఉంది. మీరంతా అత్యద్భుతంగా పనిచేశారు.’ అంటూ ట్వీట్‌ చేశారు.


మార్చి 30న ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘రంగస్థలం’ మంచి కలెక్షన్లు సాధిస్తోంది. ఇక ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కే మల్టీస్టారర్‌లో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే.

Comments

Share.

Comments are closed.