ఆపకుండా… ఆగకుండా…

0

మండే వేసవిని కూడా లెక్క చేయకుండా  ఎన్టీఆర్‌ నిర్విరామంగా చెమటోడ్చబోతున్నారు. ‘జై లవకుశ’ తర్వాత చాలా రోజులు విశ్రాంతి తీసుకోవడం, దానికితోడు తదుపరి చేయాల్సిన సినిమాలు చాలానే ఉండటంతో ఎన్టీఆర్‌ తన కొత్త చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్నారట. దర్శకుడు త్రివిక్రమ్‌ కూడా అదే పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. 


‘అజ్ఞాతవాసి’తో పరాజయాన్ని చవిచూసిన ఆయన ఈసారి విజయమే లక్ష్యంగా రంగంలోకి దిగుతున్నారు. దసరాకే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. దాంతో ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌లు ఎక్కడా ఆగకుండా, ఆపకుండా చిత్రాన్ని పూర్తి చేయాలని ఓ నిర్ణయానికొచ్చినట్టు సమాచారం. ఏప్రిల్‌ 12నే చిత్రీకరణ ప్రారంభమవుతుందని తెలిసింది. రాబోయేది వేసవి కాబట్టి రెండు నెలలపాటు సెట్స్‌లోనే చిత్రీకరణ జరిపేలా ప్లాన్‌ చేసినట్టు సమాచారం.


చిత్రం కోసం రెండు భారీ సెట్లు తీర్చిదిద్దినట్టు తెలుస్తోంది. వేసవి పూర్తవ్వగానే ఔట్‌డోర్‌లో చిత్రీకరణ జరుపుతారు. మొత్తంగా ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌లు పక్కా ప్లాన్‌తో కొత్త చిత్రం కోసం సన్నద్ధమయ్యారు. ఇందులో ఎన్టీఆర్‌ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది.

Comments

Share.

Comments are closed.