జిమ్‌లో కష్టపడుతున్న ఎన్టీఆర్‌

0

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇంకా ఈ సినిమాకు టైటిల్‌ ఖరారు కాలేదు. కాగా ఈ సినిమాలో తారక్‌ కొత్త లుక్‌లో కన్పించనున్నట్లు ప్రచారం సాగుతోంది.


ఇందుకోసం తారక్‌ జిమ్‌లో బాగా కష్టపడుతున్నారు. ప్రముఖ హాలీవుడ్‌ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ లాయిడ్‌ స్టీవెన్స్‌ ఆధ్వర్యంలో తారక్‌ దేహదారుఢ్యాన్ని పెంచుకుంటున్నారు. తారక్‌ జిమ్‌లో కష్డపడుతున్న ఓ ఫొటోను లాయిడ్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఫొటోలో తారక్‌ కాళ్లతో కసరత్తులు చేస్తూ నొప్పి తట్టుకోలేక అరుస్తున్నట్లుగా కన్పిస్తున్నారు. లాయిడ్‌ ఆయనకు సాయపడుతున్నారు. ‘ట్రెయినర్‌, క్లైంట్‌కి కఠినమైన ఫలితాలు కావాలనుకున్నప్పుడు..’ అని లాయిడ్‌ ఈ ఫొటోకు క్యాప్షన్‌ ఇచ్చారు.


ఈ సినిమాలో తారక్‌కు జోడీగా అను ఇమ్మాన్యుయేల్‌ నటిస్తున్నట్లు సమాచారం. థ్రిల్లర్‌ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది. మరోపక్క తారక్‌..ఎస్‌.ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఓ మల్టీస్టారర్‌లో నటిస్తున్నారు. ఇందులో రామ్‌చరణ్‌ మరో కథానాయకుడిగా నటిస్తున్నారు.


Comments

Share.

Comments are closed.