తారక్… నువ్ మిస్ అయ్యావ్: పూజా హెగ్డే

0

‘అరవింద సమేత వీర రాఘవ’ నుంచి బ్రేక్ తీసుకుంది పూజా హెగ్డే. కొన్ని రోజులుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో జూ.ఎన్టీఆర్‌తో కలసి సందడి చేసిన ఈ బ్యూటీ, తాజాగా తన ఫస్ట్ షెడ్యూల్‌ను కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భంగా పూజా హెగ్డే ‘అరవింద సమేత’ అనుభవాలను షేర్ చేసుకుంది. ప్రతీ రోజు సెట్స్‌కు వెళ్ళడం వీరరాఘవ అండ్ టీంతో వర్క్ చేయడం ఆనందంగా ఉందని తెలిపింది. నెక్ట్స్ షెడ్యూల్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు ట్వీట్ చేసింది. అలాగే తన సెల్ఫీలో తారక్ మిస్ అయ్యాడని, నెక్ట్స్ టైం చూసుకుందాం అని యంగ్ టైగర్‌కు మెసేజ్ చేసింది. ఇక చినబాబు నిర్మాణంలో రాయలసీమ ఫ్యాక్షనిజం నేపథ్యంలో రూపొందుతోన్న ఈ మూవీ దసరాకు రిలీజ్ కాబోతోంది.


‘అరవింద సమేత’ నుంచి బ్రేక్ తీసుకున్న పూజా హెగ్డే.. వెంటనే మహేశ్ బాబు సినిమాలో అడుగుపెడుతుందట. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్, పూజా హెగ్డే లీడ్ రోల్స్‌లో అశ్వనీదత్, దిల్ రాజు సంయుక్తంగా ఓ సినిమా నిర్మిస్తున్నారు. డెహ్రాడూన్‌లో ఈనెల 12 నుంచి ఈమూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలుకాబోతోంది. ఇక్కడ ఓ 15 రోజుల పాటు మహేశ్, పూజా హెగ్డేపై కీలక సన్నివేశాలు చిత్రీకరించాలనుకున్నారు నిర్మాతలు.


Comments

Share.

Comments are closed.