ఎన్టీఆర్ తో నటించడం అంత తేలిక కాదు – ఈషా

0

“అంతకుముందు ఆ తర్వాత” సినిమా ద్వారా వెండి తెరకు పరిచయమైన ఈషా రెబ్బా అమితుమీ సినిమాతో క్రేజ్ సంపాదించుకుంది. విభిన్న కథతో తెరకెక్కిన “అ” మూవీ లోను ఈషా రెబ్బా అద్భుత నటన ప్రదర్శించి త్రివిక్రమ్ శ్రీనివాస్ దృష్టిలో పడింది. అజ్ఞాతవాసి తర్వాత అతను తెరకెక్కిస్తున్న అరవింద సమేత వీర రాఘవ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఛాన్స్ అందుకుంది. ఆమెకి ఎన్టీఆర్ తో కలిసి ఉన్న సన్నివేశాలను గత వారం రోజులుగా తెరకెక్కించారు. ఈ అనుభవాన్ని మీడియాతో పంచుకుంది. “త్రివిక్రమ్ మూవీలో అవకాశం లభించడం నా అదృష్టం. ఈ అవకాశాన్ని ఇచ్చిన త్రివిక్రమ్ కి చాలా థ్యాంక్స్. ఈ సినిమాలోని నా పాత్ర అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. ఇక ఎన్టీఆర్ ఎనర్జీ లెవెల్స్ చూసి నేను షాక్ అయ్యాను.


ఆయనతో కలిసి నటించడం అంత ఆషామాషీ వ్యవహారం కాదనే విషయం నాకు మొదటిరోజునే అర్థమైపోయింది. కెమెరా ముందుకు రాగానే సీన్ పై మాత్రమే దృష్టి పెట్టి పాత్రలోకి వెళ్లిపోయే ఆయన, ఆ తరువాత సెట్లో అందరితోనూ చాలా సరదాగా కబుర్లు చెబుతారు” అని వివరించింది. ఇందులో మెయిన్ హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తోంది. ఈ నెల 18 నుంచి పొల్లాచ్చి లో కొత్త షెడ్యూల్ మొదలు కానుంది. జులై మొదటి వారం వరకు జరిగే ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్, ఈషా రెబ్బాపై కొన్ని సన్నివేశాలతో పాటు, సాంగ్ కూడా చిత్రీకరించనున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ పతాకం ఫై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దసరాకి రిలీజ్ చేయనున్నారు.


Comments

Share.

Comments are closed.