నా ఫ్యామిలీ మరింత పెద్దదైంది: తారక్‌

0

‘యంగ్‌ టైగర్‌’ ఎన్టీఆర్‌ మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి ప్రణతి గురువారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని తారక్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడిస్తూ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు. ‘నా కుటుంబం మరింత పెద్దదైంది. మళ్లీ బాబు పుట్టాడు’ అని పేర్కొన్నారు. ఇప్పటికే తారక్‌ దంపతులకు తొలి సంతానంగా అభయ్‌ రామ్‌ పుట్టిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు కొత్తగా చేరిన జూనియర్‌ తారక్‌కి ఏ పేరు పెట్టబోతున్నారా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అన్నట్లు బిడ్డ పుట్టబోతున్న సందర్భంగానే తారక్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా తెరిచారట. మరోపక్క తారక్‌కు కొడుకు పుట్టిన సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.


తారక్‌ ప్రస్తుతం ‘అరవింద సమేత’ చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. పూజా పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయింది. తమన్‌ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. దసరాకు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


Comments

Share.

Comments are closed.