‘జై లవకుశ’కు అరుదైన గౌరవం

0

ఎన్టీఆర్‌ నటించిన ‘జై లవకుశ’ చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. ఈ సినిమాను దక్షిణ కొరియాలో నిర్వహించిన ‘బుచాన్‌ ఇంటర్నేషనల్‌ ఫెన్టాస్టిక్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్’‌(BIFFF)లో ప్రదర్శించారు. ఉత్తమ ఆసియా చిత్రాలు (Best of Asia) విభాగంలో శనివారం ఉదయం దీన్ని ప్రదర్శించారు. ఈ చిత్రోత్సవంలో ప్రదర్శించబడిన తొలి తెలుగు సినిమా ఇది కావడం విశేషం.


ఎన్టీఆర్‌ తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన సినిమా ఇది. బాబీ దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై కల్యాణ్‌రామ్‌ సినిమాను నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు. రాశీఖన్నా, నివేదా థామస్‌ కథానాయికలు. గత ఏడాది సెప్టెంబరులో విడుదలైన ఈ సినిమా విజయం సాధించింది. సినిమా బాక్సాఫీసు వద్ద మొత్తం రూ.128 కోట్లు వసూలు చేసినట్లు విశ్లేషకులు అంచనా వేశారు.


ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్‌ ‘అరవింద సమేత’లో నటిస్తున్నారు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకుడు. పూజా హెగ్డే కథానాయిక. ఈషా రెబ్బా ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. మరోపక్క ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కించనున్న మల్టీస్టారర్‌లోనూ ఎన్టీఆర్‌ నటించనున్నారు. రామ్‌చరణ్‌ ఇందులో మరో కథానాయకుడు.

 

Comments

Share.

Comments are closed.