ఎన్టీఆర్ ని మిస్ చేసుకున్నా

0

f2 చిత్ర సక్సెస్ ప్రమోషన్లలో అనిల్ రావిపూడి కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ తో ‘పటాస్’ సూపర్ హిట్ అందుకున్న టైములో అనిల్ తర్వాత ఎన్టీఆర్ ని కలిసి ఒక లైన్ వినిపించాడట.

అనిల్.. గంటన్నర నేరేషన్ కే బాగా ఇంప్రెస్ అయిపోయిన తారక్ ఫుల్ స్క్రిప్ట్ ని డెవలప్ చెసుకుని వస్తే షూట్ మొదలుపెట్టేద్దామని అన్నాడట. అయితే అతి తక్కువ టైములో అంత పెడా స్టార్ హీరో స్క్రిప్ట్ కి న్యాయం చేయలేనేమో అని భావించి అనిల్ డ్రాప్ అయ్యాడట.

అయితే ఇప్పుడు తారక్ తో సినిమా చేయాలనీ కోరిక ఉన్నప్పటికీ.. తారక్ ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంతో బిజీగా ఉండడం.. అలాగే అనిల్ కూడా తన కమిట్మెంట్స్ తో బిజీగా ఉండడంతో.. భవిష్యత్తులో.. కచ్చితంగా చేస్తానని చెప్పాడు. ఈ కాంబినేషన్ సెట్ అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పండగే.. అని చెప్పడంలో సందేహం లేదు..!

Comments

Share.

Comments are closed.