ఎన్టీఆర్‌ ఎంట్రీ… అదిరిపోతుందంతే!

0

కథానాయకుడి పాత్రని ఆకాశమే హద్దుగా చూపించడంలో రాజమౌళిది   అందె వేసిన చేయి. అందులోనూ పరిచయ సన్నివేశం అయితే… ఇక చెప్పక్కర్లేదు. మాస్‌ ప్రేక్షకులు పూనకంతో ఊగిపోతారు. థియేటర్లు దద్దరిల్లిపోతాయి.

‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’లోనూ ఇలాంటి సన్నివేశాలకు కొదవ లేదు. అసలే ఇందులో ఇద్దరు కథానాయకులు.  ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌.. ఇద్దరి పరిచయ  సన్నివేశాల్ని భారీ హంగులతో తీర్చిదిద్దుతున్నార్ట. ఎన్టీఆర్‌ తెరపై కనిపించే తొలి సన్నివేశం గురించి ఇప్పుడు  టాలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ ఒక్క సన్నివేశం కోసమే ఏకంగా రూ.20 కోట్లు ఖర్చు పెడుతున్నారని తెలుస్తోంది.

కొమరం భీమ్‌, అల్లూరి సీతారామరాజులకు సంబంధించిన ఓ ఊహాజనిత కథ ఇది. ఈ యోధులిద్దరూ కలిస్తే ఎలా ఉంటుంది? వారిద్దరి ప్రయాణం ఏ విధంగా సాగేది? అనే ఆలోచనకు ప్రతిరూపం ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’. కొమరం భీమ్‌గా ఎన్టీఆర్‌, అల్లూరిగా చరణ్‌   నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో అలియాభట్‌ నాయిక. మరో   నాయికని ఎంపిక చేయాల్సి ఉంది. అజయ్‌దేవగణ్‌, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీతం: కీరవాణి

Comments

Share.

Comments are closed.