ఎన్టీఆర్‌కు గాయమైందా?

0

కథానాయకుడు ఎన్టీఆర్‌ చేతికి స్వల్ప గాయమైనట్లు తెలుస్తోంది. ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రి ముందున్న ఫొటోలు బయటికి వచ్చాయి. అందులో తారక్‌ కుడిచేతికి బ్యాండేజ్‌ ఉంది. దీంతో ఆయనకు స్వల్ప గాయమైందంటూ సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఫొటోలు కూడా వైరల్‌గా మారాయి. ‘త్వరగా కోలుకో తారక్‌..’ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి తారక్‌కు ఎప్పుడు, ఎలా గాయమైందో తెలియాల్సి ఉంది.


ఎన్టీఆర్‌ ప్రస్తుతం ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమాలో నటిస్తున్నారు. దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ మరో కథానాయకుడిగా నటిస్తున్నారు. దానయ్య నిర్మిస్తున్నారు. ఎమ్‌.ఎమ్‌. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. ఇందులో అల్లూరి సీతారామరాజుగా చెర్రీ, కొమరం భీమ్‌గా తారక్‌ కనిపించనున్నారు. చరణ్‌ భార్య ‘సీత’గా ఆలియా భట్‌ నటిస్తున్నారు. 2020 జులై 30న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌లో చెర్రీ గాయపడ్డ సంగతి తెలిసిందే. ఆయన కాలికి గాయం కావడంతో వైద్యుల సలహా మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు.

Comments

Share.

Comments are closed.