ఎన్టీఆర్‌ చేతికి గాయం

0

కథానాయకుడు ఎన్టీఆర్‌ ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ సెట్‌లో గాయపడ్డారు. ఆయన కుడిచేతి మణికట్టుకి గాయమైనట్టు తెలుస్తోంది. చికిత్స కోసం బుధవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లిన ఆయన, చేతికి కట్టుతో దర్శనమిచ్చారు. చిన్న గాయమే అని, వారం రోజుల్లో నయమవుతుందని వైద్యులు చెప్పినట్టు ఎన్టీఆర్‌ సన్నిహితులు తెలిపారు.

రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’లో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ కథానాయకులుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ కోసం పుణె వెళ్లిన రామ్‌చరణ్‌ అక్కడ గాయపడ్డారు. దాంతో కొన్నాళ్లు చిత్రీకరణ ఆగిపోయింది. తిరిగి వచ్చే నెల నుంచి ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ చిత్రీకరణ షురూ కానుందట.

Comments

Share.

Comments are closed.