ఎన్టీఆర్‌తో ఛాన్స్‌ అలా మిస్సయిపోయింది

0

‘స్వామిరారా’, ‘కొత్తజంట‌’, ‘బాబు బంగారం’, ‘దోచెయ్’ సినిమాల‌కు అద్భుత‌మైన విజువ‌ల్స్‌ను అందించిన సినిమాటోగ్రాఫ‌ర్ రిచ‌ర్డ్ ప్రసాద్‌. ఇటీవల విడుదలై మంచి బ్లాక్‌ బస్టర్‌ విజయం అందుకున్న ‘ఓ బేబీ’ సినిమాకు సినిమాటోగ్రఫీ అందించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన పంచుకున్న విశేషాలివీ.

‘దోచెయ్‌’ సినిమాలో నా పనితనం చూసి సుకుమార్‌, ఎన్టీఆర్‌ నాకు ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో అవకాశం ఇచ్చారు. లండ‌న్‌లో కొన్ని సన్నివేశాలను తెరకెక్కించాల్సి ఉంది. ఇందుకోసం నేను రెండు సార్లు వీసాకు అప్లై చేశాను. కానీ రిజెక్ట్ అయ్యింది. వీసా ఉండుంటే ఎన్టీఆర్ వంటి స్టార్‌తో ప‌నిచేసే అవ‌కాశం దక్కేది. ఆ ఛాన్స్‌ మిస్సవడం నా దుర‌దృష్టం’

Comments

Share.

Comments are closed.