పూణె నుంచి తమిళనాడు మారిన #RRR షెడ్యూల్

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇద్దరి హీరోల మీద కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కాగా ఆర్‌ఆర్‌ఆర్ తదుపరి ప్రధాన షెడ్యూల్ పూణేలో జరగాల్సి ఉంది. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ షెడ్యూల్ ను పూణేలో క్యాన్సల్ చేశారట. పూణే బదులు తమిళనాడులో ఈ షెడ్యూల్ ను పూర్తి చేయనున్నారు.

మొదటి వారం ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ల కాంబినేషన్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు షూట్ చేస్తారు. ఆ తరువాత వరుసగా 35 రోజుల పాటు ఎన్టీఆర్ పార్ట్ కు సంబంధించిన సీక్వెన్స్ స్ ను షూట్ చేస్తారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ధృడంగా ఉండే కొమరం భీం పాత్రలో కనిపించేందుకు ఎన్టీఆర్ మరోసారి లాయిడ్ స్టీవెన్స్‌ పర్యవేక్షణలో కఠినమైన కసరత్తులు కూడా చేస్తున్నాడు.

కాగా సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు. జులై 30, 2020 లో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Comments

Share.

Comments are closed.