తారక్‌తో అలాంటి బంధం ఏర్పడింది: రామ్‌ చరణ్‌

0

మెగా వారసుడు రామ్‌ చరణ్‌, నందమూరి వారసుడు ఎన్టీఆర్‌ మధ్య స్నేహబంధం మరింత బలపడింది. ఇద్దరూ చాలా దగ్గరైనట్లు చెర్రీ, తారక్‌ పోస్ట్‌లు చేశారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా వీరిద్దరు విడివిడిగా సోషల్‌మీడియాలో తమ బంధం గురించి మాట్లాడారు.

‘కొన్ని బంధాలు ఏర్పడటానికి చాలా సమయం పడుతుంది. ఒక్కసారి ఏర్పడ్డ తర్వాత జీవితాంతం అలానే ఉంటాయి. నాకు తారక్‌తో అలాంటి బంధం ఏర్పడింది. మై భీమ్‌..’ అంటూ తారక్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేశారు. #RRRYehDosti అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా జత చేశారు.

‘నెమ్మదిగా స్నేహంలో పడండి.. కానీ ఆ బంధాన్ని శాశ్వతంగా ఉంచుకోండి’ అనే అర్థం వచ్చేలా గ్రీక్‌ తత్వవేత్త సోక్రటీస్ చెప్పిన మాటల్ని తారక్‌ పోస్ట్‌ చేశారు. ‘మన స్నేహాన్ని ఈ వ్యాఖ్యల కంటే ఉత్తమంగా నిర్వచించలేం’ అంటూ తారక్‌ #RRRYehDosti హ్యాష్‌ట్యాగ్‌ జత చేశారు. దీంతోపాటు చెర్రీతో కలిసి దిగిన ఫొటోను కూడా షేర్‌ చేశారు.


Comments

Share.

Comments are closed.