RRR కోసం మోహన్‌లాల్, తారక్‌ మరోసారి?

0

మలయాళ నటుడు మోహన్‌లాల్, టాలీవుడ్‌ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘జనతా గ్యారేజ్‌’. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఏ రేంజ్‌లో ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరోసారి ఈ కలయికలో సినిమా రాబోతుందని టాలీవుడ్‌లో ప్రచారం ఊపందుకుంది.

ఇంతకీ అదేం సినిమా అంటే? తారక్‌, రామ్‌ చరణ్ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘రౌద్రం రణం రుధిరం’. ఈ చిత్రంలో కొమరం భీంగా దర్శనమిస్తున్నాడు తారక్‌. కొమరం భీం జీవితంలో ఆయన బాబాయ్‌ ప్రధాన పాత్ర పోషించారట. అందుకే భీం బాబాయ్‌గా మోహన్‌ లాల్‌ను చూపించే ప్రయత్నం చేస్తున్నారట జక్కన్న. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

రామ్‌ చరణ్‌.. అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన ‘భీమ్‌ ఫర్‌ రామరాజు’ వీడియో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో అలియా భట్, ఒలివియా మోరిస్‌ నాయికలు. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు.

Comments

Share.

Comments are closed.