మరోసారి బుల్లితెరపై ఎన్టీఆర్‌ సందడి

0

టాలీవుడ్ అగ్రకథానాయకుడు ఎన్టీఆర్ మరోసారి బుల్లితెరపై సందడి చేయనున్నారు. సినిమాలతో ఎప్పుడూ ప్రేక్షకులను అలరించే ఆయన 2017లో ప్రసారమైన బిగ్‌బాస్‌ సీజన్‌1’ రియాల్టీషోతో తొలిసారి బుల్లితెర వ్యాఖ్యాతగా  ప్రతివారం ఇంటిల్లిపాదిని పలకరించారు. ప్రస్తుతం కరోనా కల్లోలం విజృంభిస్తోన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన విషయం విధితమే. లాక్‌డౌన్‌ కారణంగా పలు ధారావాహికల షూటింగ్స్‌ నిలిచిపోవడంతో ఆయా సమయాల్లో గతంలో ప్రేక్షకులను అలరించిన కార్యక్రమాలను పునఃప్రసారం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘బిగ్‌బాస్‌ సీజన్‌3’ని పునఃప్రసారం చేస్తుండగా.. తాజాగా ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘బిగ్‌బాస్‌ సీజన్‌1’నూ నేటి నుంచి పునఃప్రసారం చేయనున్నారు. దీంతో ట్విటర్‌ వేదికగా ఎన్టీఆర్‌ అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Credits: Eenadu

Comments

Share.

Comments are closed.