అభిమానులకి ఎన్టీఆర్ డబుల్ ట్రీట్

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా మే 20న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం నుంచి ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అసలు సర్‌ప్రైజ్ ఉంటుందా? ఉండదా? అని ఎన్టీఆర్ అభిమానులు అయోమయంలో ఉన్న తరుణంలో నిర్మాత ఉంటుంది అని చెప్పి… వారిలో సంతోషాన్ని నింపారు. ఎందుకంటే ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తున్న మరో హీరో రామ్ చరణ్ పుట్టినరోజున వచ్చిన వీడియో అద్భుతమైన రెస్పాన్స్‌ను అందుకుంది. చరణ్ బర్త్‌డేకి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌తో వచ్చిన ఆ వీడియో సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో తెలియజెప్పింది. అప్పటి నుంచి ఎన్టీఆర్ వీడియో ఎలా ఉంటుందా? అని ఆయన అభిమానులు వేచి చూస్తున్నారు. ఖచ్చితంగా ఉంటుంది అని దానయ్య చెప్పడంతో ఒకరకంగా వారి ఆనందానికి అవధుల్లేవంటే నమ్మాలి.

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్ ఏమిటంటే… ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత యంగ్ టైగర్ త్రివిక్రమ్‌ చిత్రం ఉండనుందని అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ ఈ మేలో షూటింగ్ ప్రారంభించుకుని, మే 2021లో విడుదల అవుతుందని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ తెలిపి ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్‌ను కూడా ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా విడుదల చేయనున్నారట. అదే జరిగితే అభిమానులకి ఎన్టీఆర్ డబుల్ ట్రీట్ ఇచ్చినట్లే.

Comments

Share.

Comments are closed.