అభిమానుల నిరాశను అర్థం చేసుకోగలను!

0

పుట్టినరోజుకి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లుక్‌ విడుదల చేయడం లేదు!

‘‘నా పుట్టినరోజు సందర్భంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి ఎటువంటి ఫస్ట్‌ లుక్‌, టీజర్‌ విడుదల కావడం లేదనే విషయం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసిందని నేను అర్థం చేసుకోగలను. అభిమానుల ఆనందం కోసం ఏదో ఒకటి విడుదల చేయాలని చిత్రబృందం ఎంతగా కష్టపడిందనేది నాకు తెలుసు. అయితే, అధికారిక ఆంక్షల వలన కురదలేదు’’ అని ఎన్టీఆర్‌ అన్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌: రౌద్రం రణం రుధిరం’. రామ్‌చరణ్‌ మరో కథానాయకుడు. రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.

బుధవారం (మే 20) ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా టీజర్‌, లేదంటే ఫస్ట్‌ లుక్‌ విడుదల చేస్తారని అభిమానులు ఆశించారు. అయితే ‘‘లాక్‌డౌన్‌ మరోసారి పొడిగించడం వలన పనులన్నీ ఆగిపోయాయి. ఎంత ప్రయత్నించినప్పటికీ ఎన్టీఆర్‌ పుట్టినరోజు కానుకగా విడుదల చేయాలనుకున్న గ్లింప్స్‌ పని పూర్తి కాలేదు. అందువల్ల… ఫస్ట్‌ లుక్‌, గ్లింప్స్‌ ఏదీ విడుదల చేయడం లేదు. కచ్చితంగా మీ నిరీక్షణకు తగ్గట్టు విలువైనది అందిస్తాం. ఎప్పుడు విడుదలైనా అది మనందరికీ పెద్ద పండగలా ఉంటుంది’’ అని ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రబృందం తెలిపింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌ కూడా ఓ లేఖ విడుదల చేశారు. ‘‘రాజమౌళిగారి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ చిత్రం ఒక సంచలనం కలిగిస్తుందన్న నమ్మకం నాకుంది. ఈ చిత్రం మిమ్మల్ని తప్పకుండా అలరిస్తుంది’’ అని ఆయన పేర్కొన్నారు. అలాగే, తన పుట్టినరోజున అభిమానులు ఇంటి పట్టున ఉండాలని కోరారు. 

Comments

Share.

Comments are closed.